ముంబై డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 14 రోజుల కస్టడీ..

Aryan Khan: బాలీవుడ్ డ్రగ్స్ డర్టీ పిక్చర్‌లో షారుఖ్ తనయుడి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.

Arun Chilukuri
Updated on: 7 Oct 2021 10:00 PM IST
Aryan Khan Sent to 14 Days Judicial Custody in Cruise Drug Case
X

ముంబై డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 14 రోజుల కస్టడీ..

Aryan Khan: బాలీవుడ్ డ్రగ్స్ డర్టీ పిక్చర్‌లో షారుఖ్ తనయుడి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. మరోసారి ముంబై కోర్టు ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దానితోపాటు ఆర్యన్‌ కస్టడీని 14 రోజులకు పొడిగించింది. అంతేకాకుండా ఈ కేసును ఇకపై ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టు విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.

ఇదే సమయంలో ఎన్సీబీ అధికారులు క్రూయిజ్ షిప్ కంపెనీ కార్డెలియా క్రూయిజెస్ సీఈవోకు సమన్లు జారీ చేశారు. ఈ కేసు విచారణలో సహకరించాలని కోరారు. అలాగే, ముంబై నుంచి గోవాకు వెళుతున్న ప్రయాణికుల వివరాలను రాబట్టేందుకు ఎన్సీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో డ్రగ్స్ పార్టీకి సంబంధించిన ఆధారాల కోసం క్రూయిజ్‌లోని సీసీ ఫుటేజ్‌ని అధికారులు పరిశీలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story