logo
సినిమా

Aryan Khan: ఆర్యన్‌ఖాన్‌కు కలిసిరాని అదృష్టం

Aryan Khan Likely to be Released Tomorrow
X

Aryan Khan: ఆర్యన్‌ఖాన్‌కు కలిసిరాని అదృష్టం

Highlights

Aryan Khan: ముంబై డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్‌కు బెయిల్ వచ్చినా లక్ మాత్రం కలిసి రావట్లేదు.

Aryan Khan: ముంబై డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్‌కు బెయిల్ వచ్చినా లక్ మాత్రం కలిసి రావట్లేదు. నిన్న బెయిల్ రావడంతో ఆర్యన్ ఇవాళ ఇంటికి వెళ్లిపోతారనే అందరూ అనుకున్నారు. అయితే, ఆర్యన్‌ తరపు లీగల్ టీమ్ చేసిన చిన్న పొరపాటుతో ఇవాళ రాత్రి కూడా ఆర్యన్ జైల్లోనే గడపాల్సి వస్తుంది. ఇవాళ సాయంత్రం 5.30లోపు బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సిన ఆర్యన్ తరపు లీగల్ టీమ్ అందులో విఫలమైంది. ఆర్యన్‌కు జామీన్ ఇచ్చిన జుహీ చావ్లా ఫొటోలు లీగల్ టీమ్ అందివ్వలేకపోయింది. దీంతో ఆర్యన్ లీగల్ టీమ్‌కు క్లాస్ తీసుకున్న ఆర్థర్ రోడ్ జైల్ అధికారులు రేపైనా పూర్తిగా ప్రిపేర్ అయ్యి రమ్మని పంపించేశారు. దీంతో ఆర్యన్ రేపటి వరకూ జైల్లోనే గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

మరోవైపు ఆర్యన్‌ఖాన్‌కు జామీన్ ఇచ్చిన సీనియర్ నటి జుహీ చావ్లా సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా జైల్లోనే గడిపిన ఆర్యన్ ఎట్టకేలకు ఇంటికి చేరుకోబోతున్నాడని, దీపావళికి ముందే షారుఖ్ ఇంట్లో కొత్త వెలుగు నిండుతాయన్నారు. ఇంతకంటే గొప్ప ఉపసమనం ఏముంటుందని జుహీ చావ్లా వ్యాఖ్యానించారు.

Web TitleAryan Khan Likely to be Released Tomorrow
Next Story