Aryan Khan: ముంబై డ్రగ్స్ కేసులో ఆర్యన్ కు ఊరట

Aryan Khan: డ్రగ్స్ కేసులో షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 15 Dec 2021 4:53 PM IST
Aryan Khan Gets Exemption From Mumbai Court
X

Aryan Khan: ముంబై డ్రగ్స్ కేసులో ఆర్యన్ కు ఊరట

Aryan Khan: డ్రగ్స్ కేసులో షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఇప్పటిదాకా ప్రతి శుక్రవారం ఎన్సీబీ ఆఫీసుకు వచ్చి వెళ్లాలని షరతు పెట్టిన బాంబే కోర్టు ఇకపై అలా ఎన్సీబీ ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని పేర్కొంటూ బెయిల్ షరతును కొట్టేసింది. అయితే, ప్రత్యేక దర్యాప్తు బృందానికి మాత్రం సహకరించాలని, విచారణకు అవసరమైనప్పుడు పిలిస్తే ఢిల్లీకి వెళ్లాలనే కొత్త షరతు విధించింది.

ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లాలన్న షరతును కొట్టేయాలని కోరుతూ ఆర్యన్ ఖాన్ వేసిన పిటిషన్‌ను ఇవాళ విచారించింది. తాను ప్రతి శుక్రవారం ఆఫీసుకు వెళ్తుంటే మీడియా తనను అనుసరిస్తోందని, పోలీసులనూ వెంటబెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని ఆర్యన్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. పైగా కేసు ప్రస్తుతం ఢిల్లీలోని సిట్ కు బదిలీ అయినందున ముంబైలోని ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని వాదించాడు. ఆర్యన్ అభ్యర్థనను అంగీకరించిన హైకోర్టు ప్రతి శుక్రవారం ఎన్సీబీ ఆఫీసుకు రావాలన్న షరతును కొట్టేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story