Vindhu Bhojanam: ఆహాలో దూసుకుపోతున్న క్రేజీ మూవీ.. విందు భోజనం సినిమాకు భారీ వ్యూస్..

vindhu bhojanam: కార్తీక్ ఎస్. దర్శకత్వంలో వచ్చిన సినిమా విందు భోజనం

Shashank Gullapelli
Published on: 11 July 2024 1:58 PM IST
Arrow cinemas latest movie vindu bhojanam Garnering good views on Aha ott platform
X

Vindhu Bhojanam: ఆహాలో దూసుకుపోతున్న క్రేజీ మూవీ.. విందు భోజనం సినిమాకు భారీ వ్యూస్..

vindhu bhojanam: కార్తీక్ ఎస్ దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా విందు భోజనం. అఖిల్ రాజ్, ఐశ్వర్య హోలక్కల్, సిద్ధార్థ్ గొల్లపూడి, అభిషేక్ బొడ్డేపల్లి, హర్ష వర్ధన్, అనిత చౌదరి, కేశవ్ దీపక్, అశ్రిత వేముగంటి, మురళీకృష్ణ, బాల, వీరబధ్రమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. యారో సినిమాస్ బ్యానర్‌పై విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఆకర్షణీయమైన కథాంశం, విజువల్స్‌తో.. అద్భుతమైన ప్రదర్శనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విందు భోజనం మూవీకి ఆహాలో వచ్చిన స్పందనకు తమ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉందని నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విందు భోజనం చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులను ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story