లక్కీ ఛాన్స్ కొట్టేసిన విశ్వక్ సేన్

Arjun Sarja is Going to Direct Vishwak Sen
x

లక్కీ ఛాన్స్ కొట్టేసిన విశ్వక్ సేన్

Highlights

Vishwak Sen: యాక్షన్ కింగ్ అర్జున్ ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోగా చాలా సినిమాల్లో నటించి మంచి హిట్ లను అందుకున్నారు.

Vishwak Sen: యాక్షన్ కింగ్ అర్జున్ ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోగా చాలా సినిమాల్లో నటించి మంచి హిట్ లను అందుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న అర్జున్ మళ్లీ ఇప్పుడు విలన్ పాత్రల తో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. అయితే అర్జున్ లో ఒక దర్శకుడు కూడా ఉన్నాడు. చాలా కాలం తరువాత అర్జున్ మళ్లీ ఒక సినిమాకి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి తెలుగులో దర్శకుడిగా ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు అర్జున్. ఆ సినిమాలో యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించనున్నాడని టాక్ కూడా నడుస్తోంది.

ఈ మధ్యనే అర్జున్ విశ్వక్ సేన్ కి ఈ సినిమా కథ చెప్పగా విశ్వక్ కూడా ఓకే చెప్పాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే విడుదలైన "అశోకవనంలో అర్జున కల్యాణం" సినిమాతో మళ్లీ ఒక మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు విశ్వక్.

Show Full Article
Print Article
Next Story
More Stories