Sarkaru Vaari Paata: మహేష్ బాబు సినిమా నుండి అర్జున్ సార్జ ఔట్

Sandeep Reddy
Published on: 15 July 2021 4:56 PM IST
Sarkaru Vaari Paata: మహేష్ బాబు సినిమా నుండి అర్జున్ సార్జ ఔట్
X

Sarkaru Vaari Paata: "గీత గోవిందం" చిత్రంతో దర్శకుడిగా మంచి హిట్ కొట్టిన పరశురామ్ తాజాగా ప్రిన్స్ మహేష్ బాబుతో "సర్కార్ వారి పాట" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న "సర్కార్ వారి పాట" చిత్రంలో విలన్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నాడని మొదట్లో వార్తలు వచ్చిన తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అర్జున్ ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం అర్జున్ ని మొదట ఎంపిక చేసిన ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల చిత్రం నుండి వైదొలిగిన తర్వాత ఆ పాత్రకి తమిళ సీనియర్ నటుడు సముద్రఖనిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

ఆంజనేయుడి వీర భక్తుడు అయిన అర్జున్ చెన్నైలో 15 ఏళ్ళు శ్రమించి అర్జున్ తన సొంత డబ్బుతో 35 అడుగుల హనుమాన్ విగ్రహం గుడి నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం మినహా మలయాళంలో "మరక్కర్" అనే సినిమాలో నటిస్తున్నాడు అర్జున్ సర్జా. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ మరియు మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రాబోతున్న "సర్కార్ వారి పాట" చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, ఎస్ తమన్ తన సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ముగించుకొని 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story