‘అర్జున్ చక్రవర్తి’ ట్రైలర్ లాంచ్: ప్రేక్షకుల్లో భారీ అంచనాలు

‘అర్జున్ చక్రవర్తి’ ట్రైలర్ లాంచ్: ప్రేక్షకుల్లో భారీ అంచనాలు
x

‘అర్జున్ చక్రవర్తి’ ట్రైలర్ లాంచ్: ప్రేక్షకుల్లో భారీ అంచనాలు

Highlights

విజయ రామరాజు హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయ రామరాజు హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించగా, శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 అంతర్జాతీయ అవార్డులు రావడం విశేషం. తాజాగా విడుదలైన టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ సాధించగా, ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి.

దర్శకుడు విక్రాంత్ రుద్ర

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు మాట్లాడుతూ.. “అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా కాదు, నా తొమ్మిది ఏళ్ల కల. మా టీమ్ ఆరేళ్లపాటు కష్టపడి పనిచేసింది. నిర్మాత శ్రీని గారు నాపై నమ్మకం ఉంచి అపారమైన ఫ్రీడమ్ ఇచ్చారు. హీరో విజయ్ ప్రాణం పెట్టి పనిచేశాడు. మైనస్ డిగ్రీల్లో కూడా షర్ట్ లేకుండా నటించాడు. ఈ సినిమాకి మొత్తం టీమ్‌ అద్భుతమైన డెడికేషన్ చూపించింది” అన్నారు.

హీరో విజయ రామరాజు

“మా ట్రైలర్‌కి మీడియా మిత్రులు ఇచ్చిన స్పందనకి ధన్యవాదాలు. విజువల్స్ చూస్తే పెద్ద సినిమాలా అనిపిస్తుందని ప్రేక్షకులు చెప్తున్నారు. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ చేశానని అనిపిస్తోంది. సిక్స్ ప్యాక్ కోసం రెండు రోజులు ఏమీ తినకుండా షూట్ చేశాను. 29న ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు” అని హీరో విజయరామరాజు అన్నారు.

హీరోయిన్ సిజ రోజ్

“ఇది నా మొదటి తెలుగు సినిమా. ఇంత అద్భుతమైన సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. మీరు పాటలకు ఇచ్చిన రెస్పాన్స్‌ నాకు ఎంతో ఆనందం కలిగించింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది” అని సిజ రోజ్ తెలిపారు.

యాక్టర్ అజయ్

“ఈ సినిమాలో కోచ్ పాత్ర చేశాను. హీరో విజయ్ చాలా కష్టపడ్డాడు. బరువు తగ్గి, పెరిగి ప్రాణం పెట్టి నటించాడు. సినిమా క్వాలిటీ అద్భుతంగా ఉంది. ఈ విజయానికి ప్రధాన క్రెడిట్ డైరెక్టర్‌కే దక్కుతుంది” అని అజయ్ అన్నారు.

నిర్మాత శ్రీని గుబ్బల

“ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా సినిమా విడుదల అవుతోంది. ప్రో కబడ్డీ కూడా అదే రోజున ప్రారంభం అవుతుంది. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది. ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 94 మిలియన్ల రీచ్ సాధించింది” అని నిర్మాత శ్రీని గారు తెలిపారు.

యాక్టర్ దయానంద్ రెడ్డి

“నేను చేసిన అన్ని పాత్రల్లో ఇది బెస్ట్ రోల్ అవుతుంది. అర్జున్ చక్రవర్తి పాత్రకి లక్ష్యాన్ని ఇచ్చే పాత్ర పోషించాను. దర్శకుడు అద్భుతంగా తీశారు. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు” అని అన్నారు.

మొత్తానికి, అర్జున్ చక్రవర్తి ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆగస్టు 29న ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories