Paramapada Sopanam: అర్జున్ అంబటి 'పరమపద సోపానం'రెండో సాంగ్ విడుదల.. మాస్ బీట్స్‌తో అదరగొట్టిన డేవ్ జాండ్!

Paramapada Sopanam: అర్జున్ అంబటి పరమపద సోపానంరెండో సాంగ్ విడుదల.. మాస్ బీట్స్‌తో అదరగొట్టిన డేవ్ జాండ్!
x
Highlights

Paramapada Sopanam: 'అర్ధనారి', 'తెప్ప సముద్రం', 'వెడ్డింగ్ డైరీస్' వంటి వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అర్జున్ అంబటి, ఆ తర్వాత 'బిగ్ బాస్' రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

Paramapada Sopanam: 'అర్ధనారి', 'తెప్ప సముద్రం', 'వెడ్డింగ్ డైరీస్' వంటి వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అర్జున్ అంబటి, ఆ తర్వాత 'బిగ్ బాస్' రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇప్పుడు ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'పరమపద సోపానం' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో యువ నటి జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది.

'ఎస్.ఎస్.మీడియా' పతాకంపై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో, గుడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గుడిమిట్ల ఈశ్వర్ సహ నిర్మాతగా వ్యవహరించారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగ శివ, 'పరమపద సోపానం' చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'ఈగల్' వంటి భారీ బడ్జెట్ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

జూలై 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న 'పరమపద సోపానం' ప్రమోషన్లను ఇప్పటికే చురుగ్గా ప్రారంభించింది. ఇటీవల విడుదలైన విడుదల తేదీ పోస్టర్, అలాగే 'చిన్ని చిన్ని తప్పులేవో' అనే లిరికల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా 'చిన్ని చిన్ని తప్పులేవో' పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచింది. ఈ ఉత్సాహంతో, చిత్ర యూనిట్ తాజాగా రెండవ లిరికల్ సాంగ్‌ను కూడా విడుదల చేసింది.

'బూమ్ బూమ్' అంటూ సాగే ఈ పెప్పీ మాస్ నెంబర్‌ను కాసేపటి క్రితం యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ప్రముఖ సింగర్ గీతా మాధురి ఈ గీతాన్ని తనదైన స్టైల్‌లో ఆలపించారు. పాట విడుదల సందర్భంగా గీతా మాధురి మాట్లాడుతూ, "'పరమపద సోపానం'లోని 'బూమ్ బూమ్' పాటను పాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు నాగ శివ పూరి గారి వద్ద చాలా సినిమాలకు పని చేశారు, ఇప్పుడు దర్శకుడిగా తన మొదటి సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ పాట చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను. ఇది మంచి స్వింగ్ ఉన్న పాట. కచ్చితంగా ఈ పాట అందరినీ అలరిస్తుంది. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు" అని చెప్పారు.

రాంబాబు గోశాల అందించిన సాహిత్యం పాటకు మరింత ఉత్సాహాన్ని నింపింది. వీటన్నిటికీ మించి, సంగీత దర్శకుడు డేవ్ జాండ్ కంపోజ్ చేసిన ట్యూన్ మాస్ ఆడియన్స్‌కు చక్కటి 'పార్టీ సాంగ్' లాగా మారి, వారిని అమితంగా ఆకట్టుకునేలా ఉంది. ఈ పాట సినిమాకు మరింత బజ్‌ని తీసుకువస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories