Ariyana Glory: రాజ్ తరుణ్ కు ఆక్సిడెంట్ అవ్వాలంటూ అరియానా సంచలన వ్యాఖ్యలు

Sandeep Reddy
Published on: 30 Nov 2021 2:18 PM IST
Ariyana Glory Sensational Comments on Hero Raj Tarun in Anubhavinchu Raja Movie Chit Chat
X

రాజ్ తరుణ్ పై అరియానా సంచలన వ్యాఖ్యలు

Ariyana Glory: బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అరియానా గ్లోరి తాజాగా యువ నటుడు రాజ్ తరుణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన "అనుభవించు రాజా" సినిమాలో ఒక పాత్రలో నటించిన అరియానా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజ్ తరుణ్ అంటే అసలు తనకి నచ్చదని, ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా అతడి ఇంటర్వ్యూ కోసం వెళ్తే చాలాసేపు ఎదురుచూసిన తీరా సమయానికి ఇంటర్వ్యూ ఇవ్వకుండానే డబ్బింగ్ కరెక్షన్ ఉందని నా ముందే కారులో వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది.

ఇక అతడు వెళ్ళే కారు ఆక్సిడెంట్ అయి రాజ్ తరుణ్ కాళ్ళు, చేతులు విరిగిపోవాలని కూడా కోరుకున్నట్లు అరియానా తెలిపింది. అంతేకాకుండా మా ఇంట్లో రాజ్ తరుణ్ సినిమాలు వచ్చిన వెంటనే తీసేయ్యమని చెబుతానని చెప్పుకొచ్చింది. ఆ తరువాత మరొకసారి అతడి ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు కూడా సినిమా హిట్ అయిందని తొందరతొందరలో అక్కడి నుండి వెళ్లిపోయాడని అప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదని అప్పటి నుండి రాజ్ తరుణ్ అంటే నాకు అస్సలు నచ్చడని అరియానా తన మనసులోని మాట చెప్పింది.

బిగ్ బాస్ తరువాత రాజ్ తరుణ్ సినిమాలోనే అవకాశం వచ్చిందని.., షూటింగ్ లొకేషన్ లో రాజ్ తరుణ్ నా పక్కకి వచ్చి కూర్చొని మాట్లాడిన తనకు నచ్చలేదని.. అతడితో కొన్ని సన్నివేశాలలో నటించినప్పుడు కూడా అతడి స్థానంలో దర్శకుడు గవిరెడ్డి ఉంటే బాగుండునని అనుకున్నట్టు అరియానా తెలిపింది. ఇక ఒకరోజు షూటింగ్ లో రాజ్ తరుణ్ ని కావాలనే 8 గంటలు వెయిట్ చేయించానని ఆమె తెలిపింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story