Ardha Shathabdam: ఆసక్తిగా 'అర్థ శతాబ్దం' ట్రైలర్

Ardha Shathabdham 2021 Movie Trailer Released
x

అర్ధ శ‌తాబ్దం ట్రైలర్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Ardha Shathabdam: కార్తీక్ రత్నం‌, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘అర్ధ శతాబ్దం’.

Ardha Shathabdam: కార్తీక్ రత్నం‌, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ కీలక పాత్రల్లో రూపొందిన సినిమా 'అర్ధ శతాబ్దం'. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా... కరోనాతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఓటీటీలో విడుదలకు పచ్చజెండా ఊపడంతో నేడు ట్రైలర్ రిలీజ్ చేశారు. హీరో నాని విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

ఓ ప్రేమకథ మూలంగా గ్రామంలో ఇరువర్గాల మధ్య గొడవలు చెలరేగుతాయి. కులాల బ్యాక్ డ్రాప్‌లో రానున్న సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. శుభలేక సుధాకర్ చెప్పిన డైలాగులు సూపర్బ్‌గా ఉన్నాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇతర పాత్రల్లో సాయి కుమార్‌, ఆమని, పవిత్ర లోకేశ్‌, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని వీర్‌ ధర్మిక్‌ సమర్పణలో చిట్టి కిరణ్‌ రామోజు నిర్మించారు. నాఫాల్‌ రాజా సంగీతం అందించారు. ఈ సినిమా జూన్ 11 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories