Jayalalitha Biopic: MGR ని అచ్చుగుద్దినట్టుగా దింపేశాడు

ఇండియన్ సినిమాల్లో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. సినీ, రాజకీయ, క్రీడాకారుల జీవితాల ఆధారంగా ఈ బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు.

Krishna
Updated on: 19 Jan 2020 9:34 AM IST
Jayalalitha Biopic: MGR ని అచ్చుగుద్దినట్టుగా దింపేశాడు
X

ఇండియన్ సినిమాల్లో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. సినీ, రాజకీయ, క్రీడాకారుల జీవితాల ఆధారంగా ఈ బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. వారి జీవిత చరిత్రను చూసేందుకు కూడా ప్రేక్షకులు బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని బయోపిక్ లు వచ్చి మంచి విజయాన్ని సాధించాయి. అందులో భాగంగానే ఇప్పుడు సినీనటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతుంది.

ఈ బయోపిక్ కి "తలైవి" అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాపైన చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన జయలలిత లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఎంజీఆర్ పాత్ర పోషిస్తున్న అరవింద స్వామి లుక్ ని బయటకు వదిలారు. శుక్రవారం ఎంజీఆర్‌ జయంతి కావడంతో ఈ సందర్భంగా ఈ లుక్ ని బయటకు వదిలారు. ఎంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామి అచ్చుగుద్దినట్టుగా సరిపోయారు.

ఈ లుక్ కి నెటిజన్లు నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకి ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తుండగా, విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని తమిళ్ తో పాటు హిందీ, తెలుగు భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో కరుణానిధిగా ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.



Krishna

Krishna

Next Story