AR Rahman : మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ‌మాన్ ఇంట విషాదం

దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ‌మాన్ ఇంట విషాదం నెల‌కొంది.

Samba Siva Rao
Published on: 28 Dec 2020 3:06 PM IST
AR Rahman : మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ‌మాన్ ఇంట విషాదం
X

ఏఆర్ రెహ‌మాన్ 

దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ‌మాన్ ఇంట విషాదం నెల‌కొంది. రెహ‌మాన్ మాతృమూర్తి క‌రీనా బేగం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆయన మాతృమూర్తి క‌రీనా బేగం క‌న్నుమూసిన‌ట్లుగా తెలుస్తోంది. కాగా రెహ‌మాన్‌కి 9 నెల‌ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు ఆయ‌న తండ్రి మ‌ర‌ణించారు.. రెహ్మన్ తల్లి కరీనా క‌ష్ట‌ప‌డి ఆయనను పెంచారు. సంగీతం పట్ల రెహ‌మాన్‌కి ఉన్న శ్ర‌ద్ధ‌ను చూసి ఆ దిశ‌గా ప్రోత్సాహం అందించారు. రెహమాన్ తల్లి మరణించడంతో ఆయన తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారు. రెహమాన్ తల్లి మృతిపై సినీప్రముఖలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story