ANNAM: కృష్ణ వంశీ సినిమాకు ఏఆర్ రెహమాన్ ఫిక్సయ్యాడా?

ANNAM: దర్శకుడు కృష్ణ వంశీ తన తదుపరి చిత్రం ‘అన్నం’ ఈ మధ్యనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Venkata Chari
Published on: 18 March 2021 8:51 PM IST
AR Rahman, to compose music for Krishna Vamsis Annam?
X

ఏఆర్  రెహమాన్ (ఫొటో హన్స్ ఇండియా)

ANNAM: దర్శకుడు కృష్ణ వంశీ తన తదుపరి చిత్రం 'అన్నం' ఈ మధ్యనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం చిరంజీవి నటిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ, కృష్ణ వంశీ వాటిని పూర్తిగా కొట్టిపారేశాడు. అవి ఫేక్ న్యూస్ అని తేల్చేశాడు. హీరో పాత్ర కు ఇంకా ఎవరీని ఎంపిక చేయలేదని వెల్లడించాడు.

ఈలోపే మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

కృష్ణ వంశీ 'అన్నం' చిత్రానికి సంగీతం ఇచ్చేందుకు ఏఆర్ రెహమాన్ అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రధాన తారాగణంతోపాటు ఇతర క్యారెక్టర్లను కూడా కృష్ణ వంశీ వెల్లడించలేదు. ఒకవేళ నిజంగా ఏఆర్ రెహమాన్ 'అన్నం' సినిమా కోసం సైన్ చేస్తే.. అది ఖచ్చితంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది కూడా నిజమో లేదో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం, కృష్ణ వంశీ ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రంగమార్తాండా' చిత్రంతో బిజీగా ఉన్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story