AR Rahman: రామ్ చరణ్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న రెహమాన్

AR Rahman Scares Ram Charan Fans
x

AR Rahman: రామ్ చరణ్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న రెహమాన్

Highlights

AR Rahman: రామ్ చరన్ మూవీకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కన్ఫామ్ అయ్యింది.

AR Rahman: రామ్ చరన్ మూవీకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కన్ఫామ్ అయ్యింది. అక్కడే మెగా అభిమానులకు భయం మొదలైంది. అసలు దీనికి సంబరపడాలో, భయపడాలో తేలని పరిస్థితి చెర్రీ ఫ్యాన్స్ కి ఎదురౌతోంది. అసలు ఆస్కార్ అచీవర్ అంటే మెగా అభిమానులే కాదు, మిగతా తెలుగు జనం కూడా భయపడాల్సి వస్తోంది.. ఎందుకు?

గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ తో బుచ్చి బాబు మూవీ పట్టాలెక్కబోతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అంతావరకు బానే ఉంది కాని త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన చెర్రీ ఫ్యాన్స్ ని ఇప్పుడు ఆస్కార్ అచీవర్ భయపెట్టడమే హాట్ టాపిక్ అయ్యింది. ఏ ఆర్ రెహమాన్ రెండు ఆస్కార్లతో హిస్టరీ క్రియేట్ చేసిన మ్యూజీషియన్. కాని ఈ మ్యుజీషియన్ తెలుగు లో మాత్రం మ్యాజిక్ చేయలేకపోయాడు. తను కంపోజ్ చేస్తే తెలుగు సినిమా మటాష్ అనేంతగా ఆమధ్య నెగెటీవ్ కామెంట్స్ వచ్చాయి.. అందుకే మెగా ఫ్యాన్స్ లో భయాలు మొదలయ్యాయి.

మెగా హీరోలకు కూడా రెహమాన్ మ్యూజిక్ కలిసి రాలేదు. కొమరం పులికి తనే మ్యూజిక్ కంపోజ్ చేస్తే ఫ్లాప్ పడింది. జెంటిల్మన్ హిందీ రీమేక్ కి అనుమాలిక్ మ్యూజిక్ కంపోజ్ చేసినా, పాటలు మాత్రం రెహమాన్ కంపోజ్ చేసినవే వాడాడు.. సో అలా చిరంజీవికి కూడా రెహమాన్ సాంగ్స్ కలిసి రాలేదు. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ మూవీ గ్యాంగ్ మాస్టర్ కి కూడా రెహమానే సాంగ్స్ కంపోజ్ చేశాడు. కాని అది ఆడలేదు. అలానే అప్పట్లో విక్టరీ వెంకటేష్ మూవీ సూపర్ పోలీస్ కి కూడా ఏ ఆర్ రెహామానే మ్యూజిక్ కంపోజ్ చేశాడు. కాని ఏమైంది. అది కూడా ప్లాపని తేలింది.

తెలుగులో అప్పట్లో పల్నాటి పౌరుషం లాంటి రీమేక్ కి రెహమాన్ మ్యూజిక్ కొద్ది వరకు కలిసొచ్చింది. ఆతర్వాత ఏం మాయ చేశవావే లాంటి హిట్ పడింది. ఇలాంటి కంటెంట్ డ్రివెన్ స్టోరీలతో ఒకటీ అర యావరేజ్ హిట్లు వస్తే రావొచ్చు కాని, రెహమాన్ మ్యూజిక్ తెలుగు సినిమాకు మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది. ఏం మాయ చేశావే హిట్ అవటంతో, అదే హీరో, అదే దర్శకుడి కాంబినేషన్ లో సాహసమే శ్వాసగా సాగిపోవాలనుకున్నాడు రెహమాన్. కాని పాటలు బాగున్నా సినిమా ఆడలేదు. రెహమాన్ మ్యూజిక్ ఎందుకో బైలింగువల్ లేదంటే స్ట్రేయిట్ తెలుగు సినిమాకు కలిసొచ్చిన సందర్భాలు తక్కువే అనక తప్పదు.

ఇక తరుణ్, శ్రేయ, త్రిష కలిసి చేసిన బైలింగువల్ మూవీ నీ మనసు నాకు తెలుసు.. ఈ సినిమా పాటలు ఎంత హిట్టైనా, మూవీ మాత్రం ఊహించనంత బడా ప్లాప్ గా నిలిచింది. సో ఎలా చూసినా రెహమాన్ తెలుగుసినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తే రిజల్ట్ రివర్స్ అనే సెంటిమెంట్ బలపడింది. కాబట్టే రామ్ చరణ్ మూవీకి రెహమాన్ బాణీలంటే ఫ్యాన్స్ లో కంగారు పెరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories