ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు: ఆసక్తిగా మారిన వందన షా వ్యాఖ్యలు

Advocate Vandana Shah: ఇటీవల ఏఆర్. రెహమాన్ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Nov 2024 4:29 PM IST
AR Rahman-Saira Banu
X

ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు: ఆసక్తిగా మారిన వందన షా వ్యాఖ్యలు

Advocate Vandana Shah: ఇటీవల ఏఆర్. రెహమాన్ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ విషయం బాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే సైరా భాను లాయర్ వందన షా ఓ ఇంటర్వ్యూలో మళ్లీ వాళ్లీద్దరూ కలిసిపోయేందుకు కూడా అవకాశాలు లేకపోలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వందన షా చెప్పినట్టు రెహమాన్, సైరా భాను ఒక్కటి కావాలని కోరుకుంటున్నారు అభిమానులు.

రెహమాన్, సైరాభాను మాట్లాడుకున్న తర్వాతే విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని లాయర్ వందన షా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. వారి ముగ్గురు సంతానం మేజర్లు కాబట్టి.. ఎక్కడుంటారనేది వారి ఇష్టమన్నారు. సైరా భాను ఆర్థిక అవసరాల కోసం విడాకులు తీసుకోలేదన్నారు. రెహమాన్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సైరా ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేశారు. రెహమాన్ చాలా మంచి వాడని.. తాను బాంబేలో ఉన్నానని.. దయచేసి రూమర్స్ వ్యాప్తి చేయొద్దని అందులో కోరారు.

వందన షా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు సైరా భాను రిలీజ్ చేసిన వీడియోతో మళ్లీ వీరిద్దరు కలిసిపోతున్నారా..? అన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి. దీంతో రెహమాన్ అభిమానులతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు హ్యాపీగా ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. వందన షా వ్యాఖ్యలపై రెహమాన్, సైరా భాను ఎలా స్పందిస్తారో చూడాలి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story