RRR Movie: ఇదో అద్భతం.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకి ఏఆర్‌ రెహమాన్‌ అభినందనలు

RRR Movie: ఇదో అద్భతం.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకి ఏఆర్‌ రెహమాన్‌ అభినందనలు

Arun Chilukuri
Published on: 11 Jan 2023 11:54 AM IST
AR Rahman Congratulates RRR Movie Team
X

RRR Movie: ఇదో అద్భతం.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకి ఏఆర్‌ రెహమాన్‌ అభినందనలు

Natu Natu Song: దర్శకుడు రాజమౌళి రూపొందించిన ట్రిపుల్ ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గోల్డెన్‌ గ్లోబ్‌' అవార్డును ట్రిపుల్ ఆర్ సొంతం చేసుకుంది. సినిమాలోని 'నాటు నాటు' పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఇక ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం విభాగంలో కూడా ట్రిపుల్ ఆర్ సినిమా నామినేట్‌ అయింది.

కాగా ఈ అవార్డును గెలిచిన తొలి ఇండియన్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ నిలిచింది. ఈ అవార్డును అందుకున్న కీరవాణికి, ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా స్వర మాంత్రికుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ దీనిపై స్పందిస్తూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు విషెస్‌ చెప్పాడు. ఇదో అద్భతం.. నమ్మశక్యం కానిది.. ఇండియా తరుపున.. ఇండియన్ అభిమానుల తరుపున కీరవాణి గారికి శుభకాంక్షలు. అలాగే రాజమౌళి గారికి, ఆర్ఆర్ఆర్ టీంకు కూడా కంగ్రాట్స్' అంటూ ట్వీట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story