మ్యూజిక్ మేస్ట్రో రెహమాన్‌కు అరుదైన సత్కారం

Arun Chilukuri
Published on: 30 Nov 2020 9:22 PM IST
మ్యూజిక్ మేస్ట్రో రెహమాన్‌కు అరుదైన సత్కారం
X

భారత సినీ దిగ్గజం ఏఆర్ రెహమాన్... ఇండియన్ బ్రేక్ త్రూ ఇన్షియేటివ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ సంస్థ మ్యూజిక్ మేస్ట్రోకు ఈ అరుదైన గౌరవాన్ని అందించింది. బాఫ్టా రాయబారిగా రెహమాన్... ఇకపై నెట్ ఫ్లిక్స్‌తో కలిసి భారత్‌లో ఉన్న ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించాల్సి ఉంటుంది. సినిమాలు, కళలు, క్రీడలు, బుల్లితెర వంటి పలు రంగాల్లోని అద్భుత నైపుణ్యం ఉన్నవారిని గుర్తించడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నానని.. రెహమాన్ అన్నాడు. బాఫ్టాతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించాడు. బాఫ్టా ప్రదానం చేసే అవార్డులను ఆస్కార్‌తో సమానంగా పరిగణిస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story