AR Murugadoss: మరోసారి రిపీట్ కానున్న స్పైడర్ కాంబినేషన్?

AR Murugadoss: మరోసారి రిపీట్ కానున్న స్పైడర్ కాంబినేషన్?
x

AR Murugadoss (File Photo)

Highlights

AR Murugadoss: సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు మురుగదాస్ ప్రకటించారు.

AR Murugadoss: సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు మురుగదాస్ ప్రకటించారు. అందుకోసం అద్భుతమైన స్టొరీని రెడీ చేసినట్లు అయన తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ సినిమా అభిమానులను కాస్త నిరుత్సహపరిచిందని.. కనీ ఈ సారి మంచి స్క్రిప్ట్ సిద్డంచేసినట్లు మురుగదాస్ వివరించారు. కాగా, మహేష్ తో మురుగదాస్ స్పైడర్ చిత్రం తీయగా.. అది అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పికంచకపోవటం తెలిసిందే..

మురుగదాస్ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన 'దర్బార్' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలయి మంచి వసూళ్ళు రాబెట్టింది. ఇండియన్ స్టార్ డైరెక్టర్ఎ .ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' అంటూ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ముంబై బ్యాక్ గ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, నివేద థామస్,యోగిబాబు సునీల్ శెట్టి ముఖ్యపాత్రలు పోషించారు.

ఇక మహేష్ బాబు సినిమాలు చుస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తునాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి చిత్రబృండం మహేష్ పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. గీతా గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది..ఈ సినిమాకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. పక్కా సోషల్ మెసేజ్ తో ఈ సినిమా తెరకేక్కుతుందని తెలుస్తోంది. బ్యాంకింగ్ లోని లోపాలను ఎత్తి చూపుతూ ఈ కథ సాగనుందని సమాచారం..త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories