Jailer: గొప్ప మనసు చాటుకున్న జైలర్‌ ప్రొడ్యూసర్.. అపోలో ఆస్పత్రికి కోటి రూపాయల విరాళం..!

Apollo Hospitals Received Rs 1 Cr Donation From Jailer Producer
x

Jailer: గొప్ప మనసు చాటుకున్న జైలర్‌ ప్రొడ్యూసర్.. అపోలో ఆస్పత్రికి కోటి రూపాయల విరాళం..!

Highlights

Jailer: సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జైలర్‌. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Jailer: సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జైలర్‌. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా నిర్మాత కళానిధి మారన్ చాలా సంతోషంగా ఉన్నారు.

హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్‌ దిలీప్ కుమార్, మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌లకు విలువైన బహుమతులను ఇచ్చిన నిర్మాత కళానిధి మారన్‌ .. తాజాగా అపోలో హాస్పిటల్స్‌కు రూ.కోటి రూపాయలు అందజేశారు. కళానిధి మారన్‌ భార్య కావేరి కళానిధి అపోలో ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డిని కలిసి ఈ చెక్‌ను అందజేశారు. 100 మంది పేద పిల్లలకు గుండె చికిత్సల కోసం ఈ డబ్బును అందించినట్లు ట్వీట్‌ చేశారు.

మరోవైపు జైలర్ ఓటీటీ రిలీజ్‌పై ఇప్పటికే ఓ అధికారక ప్రకటన విడుదలైంది. ఈ సినిమా సెప్టెంబరు 7 నుంచి తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఈ సినిమా తెలుగు తమిళం, హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో అదే రోజు స్ట్రీమింగ్ కానుంది. దీంతో మరోసారి తమ అభిమాన నటుడి సినిమాను చూడోచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రజనీ ఫ్యాన్స్.


Show Full Article
Print Article
Next Story
More Stories