RGV: రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట

AP High Court Give Anticipatory Bail to Ram Gopal Varma
x

RGV: రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట

Highlights

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ టీడీపీ, జనసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి.

ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు, గుంటూరు జిల్లాలోని తుళ్లూరు అనకాపల్లి జిల్లాలోని రావికమతం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోలీసులు విచారణకు రావాలని కోరినప్పుడు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.

అసలు కేసు ఏంటి?

ఈ ఏడాది మార్చిలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత పోస్టులు పెట్టారని ఆయనపై కేసులు నమోదయ్యాయి. తొలుత ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఈ ఏడాది నవంబర్ 11న టీడీపీ మండల కార్యదర్శి ఎం. రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకులు గుంటూరు జిల్లా తుళ్లూరులో, అనకాపల్లి జిల్లా రావికమతంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదయ్యాయి. మద్దిపాడు పోలీసులు విచారణకు రావాలని వర్మకు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. కానీ, ఆయన పోలీసుల విచారణకు హాజరు కాలేదు. అదే సమయంలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories