Radhe Shyam: రాధే శ్యామ్ కు టికెట్ ధర పెంచిన ఏపీ సర్కార్

Radhe Shyam: ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది...

Shireesha
Published on: 11 March 2022 6:43 AM IST
AP Govt Increased Prabhas Radhe Shyam Movie Ticket Rate | Radhe Shyam Movie Review
X

Radhe Shyam: రాధే శ్యామ్ కు టికెట్ ధర పెంచిన ఏపీ సర్కార్

Radhe Shyam: ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే, ఏపీలో 20 శాతం షూటింగ్ జరుపుకోలేదన్న కారణంతో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు లేక నిరాశకు గురైన రాధేశ్యామ్ చిత్రబృందానికి చివరి నిమిషంలో ఏపీ ప్రభుత్వం ఊరట కలిగించింది. ప్రీమియం టికెట్ ధరను 25 రూపాయల మేర పెంచుకునే అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాధేశ్యామ్ చిత్రానికి 170 కోట్ల మేర బడ్జెట్ అయ్యిందంటూ చిత్ర నిర్మాతలు ఏపీ సర్కార్ కు బిల్లులు సమర్పించారు. ఈ నేపథ్యంలోనే, ప్రీమియం టికెట్ పై ధర పెంచుకునే అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story