సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంపై చర్చకు చిరంజీవికి సీఎం జగన్ ఆహ్వానం

* ఉదయం చిరంజీవికి ఫోన్ చేసిన పేర్నినాని * ఈ భేటీలో థియేటర్ల సమస్య, కార్మికుల జీవితాలపై చర్చించే ఛాన్స్

Sandeep Reddy
Updated on: 14 Aug 2021 8:30 PM IST
AP CM YS Jagan Invited to Chiranjeevi to Discuss The Theatre Issue And Industry Workers Problems
X

చిరంజీవి -  జగన్(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్ ఆహ్వానం పలికారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంపై చర్చకు ఆహ్వానించారు. ఇందుకు గానూ చిరంజీవికి మంత్రి పేర్ని నాని ఫోన్ చేశారు. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధమైనా ఏపీలో టిక్కెట్టు ధర సమస్యాత్మకం అయింది. థియేటర్ల సమస్య చాలాకాలంగా ఓ కొలిక్కి రాలేదు. ఈ సమయంలోనే సీఎం జగన్ సినీ పెద్దలతో భేటీ కానున్నారు.

ఈనెల చివరి వారంలో ఉండే ఈ భేటీలో ప్రస్తుతం ఉన్న థియేటర్ల సమస్య గురించి, సినీమా రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల బతుకు దెరువు సహా పంపిణీ వర్గాల వేతనాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. చిరంజీవితో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొందరు హాజరు కానున్నారు. అయితే ఈ భేటీలో తక్షణ పరిష్కారం చూపిస్తారని సినీ పరిశ్రమ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story