సినీ ప్రముఖులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్..

Telugu Film Industry: టాలీవుడ్‌ని కొంతలో కొంతైనా ఏపీకి తరలించాలని ఏపీ ప్రభుత్వం ట్రై చేస్తోంది.

Arun Chilukuri
Updated on: 20 Feb 2022 11:51 AM IST
AP CM Jagan Bumper Offer To Telugu Film Industry
X

సినీ ప్రముఖులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్..

Telugu Film Industry: టాలీవుడ్‌ని కొంతలో కొంతైనా ఏపీకి తరలించాలని ఏపీ ప్రభుత్వం ట్రై చేస్తోంది. ఇటీవ‌ల సినీ ప్రముఖుల భేటీలోనూ సీఎం ఈ అంశాన్ని ప్రస్థావనకు తెచ్చారు. ఏపీలోని ప్రధాన పట్టణాల్లో సినిమా స్డూడియోలను నిర్మించేందుకు పలువురు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా వారికి అన్ని విధాల సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. సినీ ప్రముఖులు ఏపీకి వస్తే ఇళ్లు, స్థలాలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి ఆఫ‌ర్లు ప్రకటించారు.

విశాఖలో స్టూడియోల‌కు అనుగుణంగా ఉండే స్థలాల అన్వేష‌ణ‌, సేక‌ర‌ణ ప‌నులు కూడా మొదలయ్యాయి. విశాఖ‌తో పాటు రాజ‌మండ్రి, తిరుపతి, గుంటూరు త‌దిత‌ర ప్రదేశాల్లో స్డూడియోల‌ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. క‌నీసం 20 శాతం షూటింగ్ ఏపీలోనే చేయించాలని సీఎం జగన్‌ టార్గెట్‌గా పెట్టుకున్నారు. అందుకే స్టూడియోలు, ఇళ్ల స్థలాల‌కు అనువైన స్థలాలను వెతికే ప‌నిలో పడ్డారు. ఇప్పటికే వైజాగ్ లో సినిమా వాళ్లకు సంబంధించిన‌ కొన్ని యూనియ‌న్లు ఉన్నాయి. వాళ్లంద‌రికీ స్థలాలు ఇస్తే అక్కడే సెటిల్ అవ్వచ్చు అన్నది అందరి ఆలోచనగా కన్పిస్తోంది.

ఇక చిరంజీవి, నాగార్జున‌, మంచు విష్ణు ఏపీలో స్టూడియో నిర్మాణానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇది వ‌ర‌కే కొంత‌మంది టాలీవుడ్ స్టార్లు స్టూడియోల కోసం స్థలాలు కావాల‌ని ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వాళ్లలో అర్హులంద‌రికీ స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story