Anushka Shetty: అనుష్క వల్ల విజువల్ ఎఫెక్ట్స్ ను నమ్ముకున్న డైరెక్టర్

Anushka Shetty: అనుష్క వల్ల విజువల్ ఎఫెక్ట్స్ ను నమ్ముకున్న డైరెక్టర్

Jyothi
Updated on: 25 Feb 2023 8:30 PM IST
Anushka Weight Added Additional Costs to the Producers
X

Anushka Shetty: అనుష్క వల్ల విజువల్ ఎఫెక్ట్స్ ను నమ్ముకున్న డైరెక్టర్

Anushka Shetty: స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ఈమధ్య మీడియాకి దూరంగా ఉంటుంది. ఒకవైపు సినిమాలు కూడా చేయకుండా బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉందని వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాతో అనుష్క సరికొత్త లుక్కుతో కనిపిస్తుంది అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మరోవైపు అనుష్క సరికొత్త లుక్కుతోనే కనిపించింది కానీ ఆ లుక్కుతో అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.

దానికి కారణం అనుష్క బరువు ఇంకా పెరగటం. అనుష్క కథ కొద్దిరోజులుగా కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందట. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దాని కారణంగానే బరువు కూడా బాగా పెరుగుతోందట. అయితే తాజాగా అనుష్క బరువు పెరగటం వల్ల సినిమా దర్శక నిర్మాతలకు బడ్జెట్ ఎక్కువవుతుంది అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా అనుష్క యువ హీరో నవీన్ పోలిశెట్టి సరసన ఒక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలై రెండు సంవత్సరాలు పూర్తయింది కానీ ఇంకా సినిమా మాత్రం పూర్తవ్వలేదు.

అయితే తాజాగా ఇప్పుడు అనుష్క తమిళ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో తన పాత్ర కోసం ఏ ఎల్ విజయ్ అనుష్క మీద కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ చేసి తెరపై ఆమె సన్నగా కనిపించేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇది కూడా ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా అని తెలుస్తోంది ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Jyothi

Jyothi

Next Story