Anushka Shetty: నయనతార సినిమాను రీమేక్ చేస్తున్న అనుష్క

Anushka Shetty To Remake Nayantharas Netrikann In Telugu
x

Anushka Shetty: నయనతార సినిమాను రీమేక్ చేస్తున్న అనుష్క

Highlights

Anushka Shetty: కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్యనే "నిశబ్దం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Anushka Shetty: కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్యనే "నిశబ్దం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేదు. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన సినిమాతో బిజీగా ఉన్న అనుష్క ఇప్పుడు ఒక తమిళ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార ఈ మధ్యనే "నెట్రికన్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సౌత్ కొరియా సినిమా "బ్లైండ్" కి రీమేక్ గా తెరకెక్కిన "నెట్రికన్" తెలుగులో కూడా హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. కానీ ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో నయనతార పోషించిన పాత్రలో ఇప్పుడు అనుష్క తెలుగు వర్షన్ లో కనిపించనున్నారు. అంటే ఈ సినిమా లో అనుష్క కళ్లు కనిపించని అమ్మాయిలాగా నటించనున్నారు. ఒక కళ్లు కనిపించని అమ్మాయి ఒక మిస్సింగ్ కేసు కి విటినెస్ గా మారుతుంది. మరి ఆమె క్రిమినల్ ను పట్టుకోగలిగింద లేదా అనేది ఈ సినిమా కథ. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న ఈ సినిమా తెలుగు రీమేక్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories