యాంకర్ గా మారిన అనుష్క

యాంకర్ గా మారిన అనుష్క
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా పైన భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే....

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా పైన భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ కిచ్చా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈమె పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం అనుష్క ఈ సినిమాలో ఒక యాంకర్ పాత్రలో కనిపించబోతోందట. అంటే సినిమా మొదట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర గురించి నెరేట్ చేసే పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈమె పాత్రకు సంబంధించిన లుక్ ఇప్పటికే అయిపోయిందని, ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర షూటింగ్ కూడా త్వరలో పూర్తి కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories