Anushka Shetty Quit Movies: త్వరలో సినిమాలకి గుడ్ బై చెప్పనున్న అనుష్క?

Anushka Shetty Quit Movies: త్వరలో సినిమాలకి గుడ్ బై చెప్పనున్న అనుష్క?
x
Anushka Shetty (File Photo)
Highlights

Anushka Shetty Quit Movies: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Anushka Shetty Quit Movies: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో వెండితెరకి ఆమె గుడ్ బై చెప్పనుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో భాగంగానే అనుష్క కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో అనుష్క ఒకరు.. అయితే అనుష్క త్వరలో పెళ్ళికి సిద్ధం అవుతుందని అందుకే గ్లామర్ ఇండస్ట్రీకి బై చెప్పే పనిలో ఉన్నట్టుగా ఇందుష్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడున్న ఇమేజ్ చాలు.. ఇకపై సినిమాలు చేయనని అనుకుంటున్నానని అనుష్క తన సన్నిహితుల దగ్గర చర్చించినట్టుగా సమాచారం.. అయితే దీనిపైన.అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది..

ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క.. దాదాపుగా 15 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉంటూ అందరూ స్టార్ హీరోలతో వర్క్ చేసింది అనుష్క.. తమిళ్ , తెలుగు, కన్నడ భాషలలో కలిపి అనుష్క 50 కి పైగా సినిమాలలో నటించింది. ఇక

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది అనుష్క.. అందులో భాగంగా వచ్చిన అరుంధతి, రుద్రమదేవి, బాగుమతి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.. ఇలా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో అనుష్క శెట్టి సడన్ గా సినిమాలకి గుడ్ బై చెపుతుంది అనే వార్త అందరికి షాక్ ఇచ్చినట్టు అవుతుంది.

ప్రస్తుతం అనుష్క ప్ర‌ధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'నిశ్శ‌బ్దం' .. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఏప్రిల్ 2న విడుద‌ల‌ కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అనుష్కతో పాటుగా అంజలి, షాలిని పాండే, మాధవన్ కీలక పాత్రలు పోషించారు.. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories