Anushka Shetty: అనుష్క క‌థ మ‌ళ్లీ మొద‌టికి!

Anushka Shetty: *బరువు తగ్గాకే షూటింగ్ చేస్తాను అంటున్నా అనుష్క

Sriveni Erugu
Updated on: 31 May 2022 8:31 PM IST
Anushka Decides to Lose Weight
X

బరువు తగ్గాలని నిర్ణయించుకున్న అనుష్క 

Anushka Shetty: ఒకప్పుడు చాలా ఫిట్ గా ఉండే టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి "సైజ్ జీరో" సినిమా కోసం బాగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కోసం వెయిట్ పెరిగిన అనుష్క అప్పటినుంచి ఆ బరువును తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కానీ అందులో ఏవి ఫలించడం లేదు. బ‌రువు త‌గ్గించుకోవ‌డానికి స్వీటీ చేస్తున్న ప్ర‌య‌త్నాలు మ‌ళ్లీ మొద‌టికి వచ్చాయి. ఆ మధ్య ఆస్ట్రేలియా వెళ్ళి మరీ బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ తీసుకున్న స్వీటీ కొంచెం వెయిట్ తగ్గింది కానీ మళ్లీ ఇక్కడికి వచ్చాక బరువు పెరిగి పోయింది. తాజాగా ఇప్పుడు సహజమైన పద్ధతిలో బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తున్న అనుష్క శెట్టి కొత్త సినిమాలను కూడా ఓకే చేయడం లేదని తెలుస్తోంది.

అనుష్క హీరోయిన్ గా నవీన్ పొలిశెట్టి హీరోగా ఒక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కూడా అయింది కానీ కొన్ని సీన్స్ షూటింగ్ పూర్తయిన తరువాత షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. అనుష్క బరువు పెరగడం వల్ల ఆమెపై చేయాల్సిన సీన్లు ఇంకా పెండింగ్లోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో బరువు తగ్గాలని నిర్ణయించుకున్న అనుష్క వెయిట్ తగ్గాకే షూటింగ్ కి వస్తాను అని దర్శకనిర్మాతలకు చెప్పిందట. ఇక మరో రెండు నెలల వరకు అనుష్క షూటింగ్ నీ పక్కన పెట్టి బరువు తగ్గే ప్రయత్నాల్లో బిజీగా ఉంటుందని తెలుస్తోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story