Anushka Nishabdham Movie: అనుష్క 'నిశబ్ధం' అక్టోబర్ లో విడుదల కానుందా?

Anushka Nishabdham Movie | లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క... ఆమె చేసిన అరుంధతి, భాగమతి, పంచాక్షరి లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

S. Srikanth
Updated on: 12 Sept 2020 5:31 PM IST
Anushka Nishabdham Movie: అనుష్క నిశబ్ధం అక్టోబర్ లో విడుదల కానుందా?
X

Anushka Nishabdham Movie | లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క... ఆమె చేసిన అరుంధతి, భాగమతి, పంచాక్షరి లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా అనుష్కకి స్టార్ హీరోలతో సమానంగా పేరు కూడా వచ్చింది. ఇప్పుడు 'నిశబ్దం' అంటూ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. అంజలి, శాలిని పండే, మాధవన్ ఈ చిత్రంలో కీలక పత్రాలు పోషించారు. హేమంత్ మధుకర్ దర్సకత్వంలో కోన ఫిలిం కార్పొరేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ముందుగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లిష్, హిందీ విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.విడుదలకు అన్ని సిద్దంగా ఉన్న తరుణంలో.. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంబన కారణంగా కేంద్ర ప్రభుత్వం మార్చ్ నెలలో దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో థియేటర్లు మూతబడటంతో 'నిశ్శబ్దం'తో పాటు విడుదలకు సిద్దంగా ఉన్నఅన్ని సినిమాల విడుదలలు ఆగిపోయాయి. అలాగే నిర్మాణలో ఉన్న అనేక చిన్న, పెద్ద చిత్రాలు ఆగిపోయాయి.

అయితే, గతంలో ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతందని వదంతులు వినిపించాయి. ప్రస్తుతం అవి నిజమనే అనిపిస్తుంది, తాజాగా చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ రెండవ వారం, లేదా మూడవ వారంలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాబట్టి, మేకర్స్ ఫైనల్ డబ్బింగ్, విఎఫ్ఎక్స్ పనిలో మునిగిపోయరాని.. ప్రస్తుతం ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం..

S. Srikanth

S. Srikanth

Next Story