Chandramukhi Sequel: "చంద్రముఖి" సీక్వెల్ కోసం హీరోయిన్ గా అనుష్క?

* సీక్వెల్ సినిమా కోసం అనుష్క ని సంప్రదించిన లారెన్స్

admin1
Updated on: 20 Sept 2021 7:00 PM IST
Chandramukhi Sequel: చంద్రముఖి సీక్వెల్ కోసం హీరోయిన్ గా అనుష్క?
X

Chandramukhi Sequel: టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ని వెండితెరపై చూసి చాలా కాలం అయింది. 2018 లో విడుదలై సూపర్ హిట్ అయిన "భాగమతి" సినిమా తర్వాత అనుష్కవెండి తెరపై కనిపించలేదు. అనుష్క హీరోయిన్ గా నటించిన "నిశబ్దం" సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో గతేడాది విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ను అందుకోలేకపోయింది. తాజాగా ఇప్పుడు అనుష్క ఒక తెలుగు సినిమాతో బిజీగా ఉంది.

మరోవైపు 2005లో విడుదలై సూపర్హిట్ అయిన "చంద్రముఖి" సినిమాకి సీక్వెల్ తీయబోతున్నట్లు గా రాఘవ లారెన్స్ ఈ మధ్యనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అనుష్క ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు రావాల్సి ఉంది. 2010లో చంద్రముఖి సినిమాకి స్పిరిచువల్ సీక్వెల్గా "నాగవల్లి" అనే సినిమా మా విడుదలైంది.

వెంకటేష్ హీరోగా నటించిన ఆ సినిమాలో అనుష్క హీరోయిన్ గా కనిపించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ చంద్రముఖి సినిమాకి సీక్వెల్ అంటే అనుష్క ఒప్పుకుంటుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story