Anushka Shetty: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అనుష్క

Anushka Shetty: అతిగా నవ్వడం తనకున్న వ్యాధి అంటున్నా అనుష్క

Dhatripriya
Published on: 15 Feb 2023 11:53 AM IST
Anushka Is Suffering With A Rare Disease
X

Anushka Shetty: ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న అనుష్క

Anushka Shetty: గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి సినిమాలకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నో వ్యాధుల నుండి బయట పడిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. క్యాన్సర్ బారిన పడి కూడా చికిత్స పొంది తిరిగి ఆరోగ్యవంతులు అయిన హీరోయిన్లు ఉన్నారు. సమంత కూడా మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతుంది కానీ సినిమాలలో కూడా అంతే జోరుగా పాల్గొంటుంది.

రేణు దేశాయ్ కూడా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలియజేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక తమిళ్ మీడియాతో మాట్లాడుతూ అనుష్క ఈ విషయాన్ని వెల్లడించింది. ఒకసారి నవ్వటం మొదలుపెడితే అనుష్క ఏకధాటిగా 15 నుంచి 20 నిమిషాల పాటు ఆపకుండా నవ్వుతుందట. అదే తనకు సమస్యగా మారింది అని ఒక తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అనుష్క.

ఏదైనా నవ్వించే సన్నివేశం చేస్తే తాను చాలాసేపు నవ్వుతూనే ఉంటానని దీంతో షూటింగ్ కి ప్యాకప్ చెప్పి ప్రొడక్షన్ వాళ్ళు టిఫిన్స్ లేదా స్నాక్స్ కంప్లీట్ చేసుకుని వస్తారని చెప్పింది అనుష్క. అయితే నవ్వడంలో వ్యాధి ఏముంది మంచిదే కదా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అనుష్క నవీన్ పోలిశెట్టి హీరోగా ఒక సినిమాలో నటిస్తున్నారు ఆ సినిమాకి "మిస్ షట్టి మిస్టర్" పోలిశెట్టి అనే టైటిల్ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story