Anushka Shetty: ఇది ఒక న్యూ ఏజ్ సినిమా అంటున్న అనుష్క డైరెక్టర్

Anushka Shetty: కథలో మార్పులు చెప్పి మెరుగుపరిచిన అనుష్క

admin1
Updated on: 15 Nov 2021 7:30 PM IST
Anushka Shetty do Some Changes in Maheshs Story
X

అనుష్క శెట్టి అండ్ డైరెక్టర్ మహేష్ (ఫైల్ ఇమేజ్)

Anushka Shetty: టాలీవుడ్ సార్ బ్యూటీ అనుష్క శెట్టి ఇప్పుడు "రారా కృష్ణయ్య" ఫేమ్ మహేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ కథ రాసేటప్పుడు తాను ఎవరినీ మైండ్ లో పెట్టుకో లేదని కానీ అనుష్క కి కథ చెప్పిన వెంటనే నచ్చేసి ఓకే చెప్పారని అన్నారు దర్శకుడు మహేష్. అయితే అనుష్క వంటి స్టార్ హీరోయిన్ తో సినిమా కాబట్టి ఆమె ఆమె క్రేజ్ కి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేయాలని అనుకున్నారట కానీ అనుష్క మాత్రం ఎలాంటి మార్పులు వద్దని, ఎందుకంటే అందులో ఉన్న స్ట్రాంగ్ పాయింట్ తన ఇమేజ్ వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు అని అన్నారట.

అయితే కథ వింటున్నప్పుడు మాత్రం అనుష్క కొన్ని చిన్న చిన్న మార్పులు అని చెప్పారట దీని గురించి మాట్లాడుతూ అనుష్కకి చాలా నాలెడ్జ్ ఉందని స్క్రిప్ట్ పరంగా ఆమెకి చాలా కమాండ్ ఉందని ఆమె వల్లే తాను ఒక రైటర్గా మరింత మెరుగు పడ్డానని చెప్పుకొచ్చారు మహేష్.

ఇక సినిమా గురించి చెబుతూ ఇది ఒక న్యూ ఏజ్ సినిమా అని అన్నారు మహేష్. అంతే కాకుండా ఈ సినిమా కి అనుష్క హీరోయిన్గా ఒప్పుకోవడం చాలా సంతోషంగా ఉందని తనతో షూటింగ్ తొందరగా మొదలు పెట్టాలని ఆసక్తిగా ఉందని అన్నారు మహేష్.

admin1

admin1

Next Story