క్రేజీ ఆఫర్ కొట్టేసిన అనూ ఇమ్మాన్యుయేల్‌

క్రేజీ ఆఫర్ కొట్టేసిన అనూ ఇమ్మాన్యుయేల్‌
x
Highlights

టాలీవుడ్ హీరోయిన్ లలో మలయాళం బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌ దురదృష్టం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. 'మజ్ను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన...

టాలీవుడ్ హీరోయిన్ లలో మలయాళం బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌ దురదృష్టం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. 'మజ్ను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈమె మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి సినిమాలతో తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకున్న అనూ ఎమ్మాన్యుల్ కి గత ఏడాది కేవలం డిజాస్టర్లను మాత్రమే మిగిలింది. 'అజ్ఞాతవాసి' సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ఈమెకు ఆఫర్లే కరువై పోతాయి అనుకుంటే 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా లో బన్నీ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కింది కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ గా మారింది.

ఆ తర్వాత 'శైలజ రెడ్డి అల్లుడు' సినిమాలో నటించింది కానీ ఆ సినిమా కూడా సరిగా ఆడకపోవడంతో అనూ ఇమ్మాన్యుయేల్‌ పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. అయితే గత కొంత కాలంగా తన సత్తా చాటుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అనూ ఇమ్మాన్యుయేల్‌ కు ఒక క్రేజీ ఆఫర్ వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు సిద్ధమవుతోంది. పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది అనూ ఇమ్మాన్యుయేల్‌. మరి ఈ సినిమా తన కెరీర్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories