సిద్ధార్థ్ సరసన శైలజ రెడ్డి కూతురు!

సిద్ధార్థ్ సరసన శైలజ రెడ్డి కూతురు!
x

 Siddharth and Anu Emmanuel 

Highlights

Anu Emmanuel In Mahasamudram : RX 100 లాంటి భారీ హిట్ సినిమా తర్వాత దర్శకుడు అజయ్ భూపతి 'మ‌హాస‌ముద్రం' అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.

Anu Emmanuel In Mahasamudram : RX 100 లాంటి భారీ హిట్ సినిమా తర్వాత దర్శకుడు అజయ్ భూపతి 'మ‌హాస‌ముద్రం' అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అదితి రావు హైదరీని ఎంపిక చేసింది చిత్రబృందం.. ఇందులో అదితి రావు హైదరీ శర్వానంద్ సరసన నటించనుంది.

అటు తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ని ఎంపిక చేశారు మేకర్స్.. సిద్ధార్థ్ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ నటించనుంది. అనూని సినిమాలోకి ఆహ్వానిస్తూ ట్వీట్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ.. "అనూ ఇమ్మాన్యుయేల్‌ ఈ సినిమాలో భాగమైందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ప్రతి పాత్రకీ ఎంతో ప్రాధాన్యం ఉండేలా అజయ్‌ ఈ కథను రాశారు" అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది.

ఇంకా సినిమాని మొదలు పెట్టకముందే చిత్ర యూనిట్ సినిమా నుంచి అప్డేట్ లను రిలీజ్ చేస్తూ సినిమా పైన భారీ అంచనాలని పెంచేస్తుంది. లవ్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళంలో చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి..

Show Full Article
Print Article
Next Story
More Stories