Anu Emmanuel: ప్రేమ.. పెళ్లి గురించి హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Anu Emmanuel Reacts on Love Marriage
x

ప్రేమ పెళ్లి పై రియాక్ట్ అయిన అను ఇమ్మన్యుల్

Highlights

Anu Emmanuel: పెళ్లి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అంటున్న అల్లు శిరీష్ హీరోయిన్

Anu Emmanuel: "మజ్ను" సినిమాతో హీరోయిన్గా పరిచయమైన అను ఇమ్మాన్యుయేల్ తన గ్లామర్ తో మరియు నటనతో ప్రేక్షకులను బాగానే మెప్పించింది. కానీ ఇంకా బ్లాక్ బస్టర్ మాత్రం అందుకోలేదు. ఒక హిట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అను ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు అల్లు శిరీష్ హీరోగా "ఊర్వశివో రాక్షసివో" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

మొదట ఈ సినిమాకి "ప్రేమ కాదంట" అనే టైటిల్ అనుకున్నారు కానీ ఆ తర్వాత "ఊర్వశివో రాక్షసివో" అనే టైటిల్ ను ఖరారు చేసారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం నుంచి అల్లు శిరీష్ మరియు అను ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించటం మొదలైంది. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆ పుకార్లలో నిజం లేదని తాము కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఒక కొత్త సినిమా మొదలైనప్పుడు ఇలాంటి పుకార్లు చాలా కామన్ అని స్పష్టం చేశారు అల్లు శిరీష్.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అను ఇమ్మాన్యుయేల్ కూడా ఈ పుకార్లపై రియాక్ట్ అయింది. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు డేటింగ్ చేయడం లేదని సింగిల్ కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం తన కెరీర్ మీదే ఉందని ఇప్పట్లో పెళ్లి ప్రస్తావన తేవటం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది ఈ భామ.

Show Full Article
Print Article
Next Story
More Stories