ప్యాన్ ఇండియా దారిన వెళుతున్న మరొక యువ హీరో

Pan India: ఈ మధ్యకాలంలో హీరోలందరూ ప్యాన్ ఇండియన్ సినిమాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సృష్టించిన ఈ ట్రెండ్ని ఇప్పుడు అందరూ హీరోలు ఫాలో అయిపోతున్నారు.

admin1
Updated on: 4 Feb 2022 2:41 PM IST
Another young hero on his way to Pan India
X

ప్యాన్ ఇండియా దారిన వెళుతున్న మరొక యువ హీరో

Pan India: ఈ మధ్యకాలంలో హీరోలందరూ ప్యాన్ ఇండియన్ సినిమాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సృష్టించిన ఈ ట్రెండ్ని ఇప్పుడు అందరూ హీరోలు ఫాలో అయిపోతున్నారు. ఈ మధ్యనే "పుష్ప" సినిమాతో అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. "ఆర్ఆర్ఆర్" సినిమాతో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించనున్నారు. తాజాగా ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాల వైపు అడుగులు వేస్తున్న యువ హీరో విజయ్ దేవరకొండ. తెలుగులో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా విజయ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

త్వరలోనే తన "లైగర్" సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్నాడు విజయ్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కరణ్ జోహార్ మరియు చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. హిందీ సినిమాలు కూడా డైరెక్ట్ చేసిన అనుభవం పూరి కి ఉంది. ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ అయితే పూరి జగన్నాథ్ బాలీవుడ్లో కూడా స్టార్ డైరెక్టర్ గా మారిపోయే అవకాశం లు ఉన్నాయి. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటారో వేచి చూడాలి.

admin1

admin1

Next Story