వాల్తేరు వీరయ్య లో కూడా మార్ మార్ టక్కర్ మార్ పాట

వాల్తేరు వీరయ్య లో కూడా మార్ మార్ టక్కర్ మార్ పాట

Rama Rao
Updated on: 28 Oct 2022 9:30 PM IST
Another song for Waltair Veerayya | Telugu Movie News
X

వాల్తేరు వీరయ్య లో కూడా మార్ మార్ టక్కర్ మార్ పాట

Waltair Veerayya Song: ఈ మధ్యనే "గాడ్ ఫాదర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు "వాల్తేరు వీరయ్య" సినిమాతో బిజీగా ఉన్నారు. కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే "గాడ్ ఫాదర్" సినిమాలో "మార్ మార్ తక్కర్ మార్" పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇప్పుడు "వాల్తేరు వీరయ్య" సినిమాలో కూడా అలాంటి మంచి బీట్ ఉన్న సాంగ్ ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో "శంకర్ దాదా జిందాబాద్" సినిమాలో కూడా ఒక పాటలో రవితేజ చిరంజీవి పక్కన స్టెప్పులు వేశారు. మళ్ళీ ఇన్నాళ్లకు వాల్తేరు వీరయ్య సినిమాలో పాటకి వీరిద్దరూ కలిసి స్టెప్పులు వెయ్యబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి.

భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. నందమూరి బాలకృష్ణ మరియు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ప్రేక్షకులందరికీ రాబోతున్న "వీర సింహారెడ్డి" సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది సంక్రాంతి విజేతగా నిలుస్తుందో వేచి చూడాలి.

Rama Rao

Rama Rao

Next Story