Sita Ramam Movie: "సీతారామం" ఖాతాలో మరొక రికార్డు

Sita Ramam Movie: అరుదైన రికార్డు సృష్టించిన "సీతారామం"

Jyothi
Updated on: 21 Aug 2022 12:12 PM IST
Another Record on Account of Sita Ramam Movie
X

Sita Ramam Movie: "సీతారామం" ఖాతాలో మరొక రికార్డు

Sita Ramam Movie: దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన "సీతారామం" సినిమా ఆగస్టు 5, 2022 న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న మరియు తరుణ్ భాస్కర్ లు ముఖ్యపాత్రలు పోషించారు. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకు వెళ్లిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మధ్యకాలంలో విడుదలై మూడు రోజులు పూర్తికాకుండానే కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. కానీ "సీతారామం" సినిమా మాత్రం విడుదలైన మూడు వారాలైనా కూడా ఇంకా మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఆసక్తికరంగా బీసీ సెంటర్లలో కూడా "సీతారామం" వంటి క్లాస్ సినిమా హవా బాగానే కొనసాగుతోంది. ఈ మధ్యనే శుక్రవారం నాడు గాజువాక లాంటి సెంటర్లలో "సీతారామం" థియేటర్లు హౌస్ ఫుల్ గా నడిచాయి. ఇది ఒక విధంగా అరుదైన రికార్డ్ అని చెప్పుకోవాలి. ఆఖరికి హైదరాబాద్లోని మెయిన్ థియేటర్లలో కూడా టికెట్లు దొరకటం కష్టతరంగా మారింది. ఇక సినిమా థియేటర్లలో అమ్మాయిలు ఎక్కువగా ఉంటున్నారని తెలుస్తోంది. 45 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి 60 కోట్ల వసూలు చేసే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది.

Jyothi

Jyothi

Next Story