Rajinikanth: రజనీ తగ్గేదేలే.. 'జై భీమ్' దర్శకుడితో సినిమా..

Rajinikanth: రజనీకాంత్ తన 170వ చిత్రాన్ని కూడా ప్రారంభించుకుంటున్నారు.

Dhatripriya
Updated on: 24 April 2023 8:30 PM IST
Another New Film In Line For Rajinikanth
X

Rajinikanth: లైన్ లో మరో కొత్త సినిమా..రజనీ తగ్గేదేలే..

Rajinikanth: సూపర్ స్టార్ రజనీ కాంత్ అంటే అందరికీ సుపరిచితమే..కేవలం ఒక్క తమిళ, తెలుగు ప్రేక్షకులకే కాదు దేశ వ్యాప్తంగా గర్వించదగ్గ హీరో రజనీకాంత్. ఆయన చిత్రం విడుదల అయితే తమిళనాడులో ఒక పండుగే. రజనీ సార్ ఈ ఏజ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన జైలర్ మూవీ చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ జైలర్ మూవీలో రమ్యకృష్ణ, తమన్నా ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

జైలర్ మూవీలో రజనీ త్రి డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. ఇకపోతే, ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా..సూపర్ స్టార్ మరో కొత్త సినిమాని లైన్ లో పెట్టేశారు. జైలర్ మూవీ తర్వాత రజనీ తన పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ సినిమా చేస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ ముస్లిం మత పెద్దగా కనిపించనున్నారు. ఇదిలా ఉండగా రజనీకాంత్ తన 170వ చిత్రాన్ని కూడా ప్రారంభించుకుంటున్నారు.

జైభీమ్ ఫేం డీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ తన 170వ చిత్రాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా వచ్చే నెలలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాని యాదార్థ సంఘటనల ఆధారంగా జ్ఞానవేల్ చిత్రీకరిస్తారని..ఇందులో సూపర్ స్టార్ ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా పోరాడే రిటైర్డ్ ముస్లిం పోలీస్ అధికారిగా కనిపిస్తారని తెలుస్తోంది.

జ్ఞానవేల్ మూవీలో రజనీ తన అభిమానులకు వైవిధ్యమైన అనుభూతి ఇవ్వడం ఖాయమని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక, ఈ సినిమా కూడా కోర్టు, జైలు నేపథ్యంగా ఉంటుందని తెలియడంతో..రజనీ అభిమానులు కూడా ఆయనలోని విభిన్న కోణాన్ని చూసేందుకు ఇప్పటినుంచే ఆసక్తి చూపిస్తున్నారు. ఏదిఏమైనా, వరుస సినిమాలను లైన్ లో పెడుతూ రజనీ కుర్ర హీరోలకు చెమటలు పట్టించేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story