రాజమౌళి దర్శకత్వంలో మరో మెగా హీరో?

Tollywood: పవర్ స్టార్ తో చేతులు కలపనున్న బాహుబలి డైరెక్టర్?

Jyothi
Published on: 1 Jun 2022 11:22 AM IST
Bahubali Director To Join Hands With Power Star?
X

రాజమౌళి దర్శకత్వంలో మరో మెగా హీరో?

Tollywood: "ఆర్ఆర్ఆర్" సినిమాతో మరొక మాస్టర్ పీస్ ని సృష్టించిన రాజమౌళి మిగతా డైరెక్టర్లతో ఏమాత్రం పోటీ లేకుండా తన సినిమాల కలెక్షన్లు తానే బ్రేక్ చేసుకుంటూ ప్రతి సినిమాతో కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే "సర్కారు వారి పాట" సినిమాతో హిట్ అందుకున్న మహేష్ బాబు త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు.

ఆ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి సినిమా ని పట్టాలెక్కించనున్నారు మహేష్ బాబు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఒక మెగా హీరో తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా టాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మహేష్ బాబు తో సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా కోసం రాజమౌళి ఒక పెద్ద ప్రొడ్యూసర్ ని లైన్ లో పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకుని పవన్ కళ్యాణ్ రాజమౌళి తో చేతులు కలపడానికి సిద్ధం అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Jyothi

Jyothi

Next Story