Rana Daggubati: 1940 కథతో మరో హీరో!

Rana Daggubati: ప్రస్తుతం హీరోగా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా.

Venkata Chari
Published on: 6 April 2021 11:06 AM IST
Another Hero With a 1940s Periodic Genre Story
X

దగ్గుబాటి  రానా (ఫైల్ ఫొటో)

Rana Daggubati: ప్రస్తుతం హీరోగా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా. ఇటీవలే రానా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీ "అరణ్య" ను తమిళ డైరెక్టర్ ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించారు. కానీ, ఈ సినిమా టాక్ పరంగా బాగానే ఉన్నా... కలెక్షన్స్ రాబట్టడంలో మాత్రం వెనుకంజలో ఉంది.

అరణ్య సినిమా కోసం రానా దాదాపు ఏడాది వెయిట్ చేశారు. కానీ, ఆశించిన మేర విజయం సాధించలేదు. అయితే రానా నటిస్తున్న "విరాటపర్వం" సినిమా తుదిదశకు చేరుకుంది. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తుండడంతో టాలీవుడ్ లో బజ్ క్రియోట్ అయింది.

అయితే, ప్రస్తుతం రానా మరో పీరియడిక్ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. రానా తదుపరి సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు వెంకీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ స్టోరీ డిఫరెంట్ గా ఉండబోతుందంట. అందుకే వెంటనే ఓకే చెప్పాడంట రానా. ఈ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇది 1940 కాలంలో జరిగే కథలో పీరియడిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా బాగానే ఉంటాయని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అఫిషీయల్ ఎనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రానా ప్రస్తుతం విరాటపర్వంతో పాటు పవన్ కళ్యాణ్ తో 'అయ్యప్పనుమ్ కోషియం' సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story