Anjali: రీమేక్ సినిమాలో కీలకపాత్ర పోషించనున్న అంజలి

Anjali: ఈ మధ్య టాలీవుడ్ లో మలయాళ సినిమాల హవా బాగా నడుస్తోంది.

admin1
Published on: 10 Aug 2021 1:40 PM IST
Anjali in a Malayalam Movie Nayattu Remake?
X

Anjali: రీమేక్ సినిమాలో కీలకపాత్ర పోషించనున్న అంజలి

Anjali: ఈ మధ్య టాలీవుడ్ లో మలయాళ సినిమాల హవా బాగా నడుస్తోంది. ఒకదాని తర్వాత మరొకటి సూపర్ హిట్ మలయాళ సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే చాలా మలయాళం సినిమాలు తెలుగులో రీమేక్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో "నాయట్టు" కూడా ఒకటి. కుంచకో బోబన్, జోజు జార్జ్, నిమిష సాజయన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

గీత ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలుగు రీమేక్ లోని ఒక కీలక పాత్ర కోసం దర్శక నిర్మాతలు అంజలిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా మణిరత్నం నిర్మించిన "నవరస" అనే వెబ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ లో కనిపించిన అంజలి "నాయట్టు" సినిమా తెలుగు రీమేక్ లో ఒక కీలక పాత్ర పోషించేందుకు ఎంపిక చేసినట్లు సమాచారం. మలయాళంలో నిమిషా సాజయన్ పోషించిన పాత్రలో అంజలి కనిపించనుంది. అంటే అంజలి ఈ సినిమాలో ఒక కానిస్టేబుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అన్నమాట. మరో వైపు మరియు కుంచకో బోబన్ పాత్ర కోసం సత్యదేవ్ ని సంప్రదించినట్లు సమాచారం. అయితే వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

admin1

admin1

Next Story