NTR30: త్వరలో మ్యూజిక్ సెట్టింగ్స్ ను మొదలు పెట్టబోతున్న కొరటాల శివ

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగ్ తో అలాగే తన "ఎవరు మీలో కోటీశ్వరులు" షో తో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

admin1
Published on: 28 Aug 2021 2:32 PM IST
Anirudh Ravichander to Begin Composing for NTR30
X

NTR30: త్వరలో మ్యూజిక్ సెట్టింగ్స్ ను మొదలు పెట్టబోతున్న కొరటాల శివ

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగ్ తో అలాగే తన "ఎవరు మీలో కోటీశ్వరులు" షో తో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ సినిమాని అభిమానులు #ఎన్టీఆర్30 అని పిలుచుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పనులు త్వరగా మొదలు పెట్టాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే కొరటాల శివ ఈ సినిమాకి సంగీతాన్ని అందించడం కోసం టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం మ్యూజిక్ సెట్టింగ్స్ ను త్వరలోనే మొదలు పెట్టడానికి చూస్తున్నారు కొరటాల శివ. వచ్చేనెల కొరటాల మరియు అనిరుధ్ రవిచందర్ కలిసి ఈ సినిమా మ్యూజిక్ సెషన్స్ లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే పలు తెలుగు చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను మెప్పించిన అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం కూడా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తారు అని అభిమానులు విశ్వసిస్తారు. మిక్కిలినేని సుధాకర్ మరియు కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

admin1

admin1

Next Story