Animal Pre Teaser: బాలీవుడ్ లో ట్రెండ్ బెండ్ తీసేందుకు.. సందీప్ రెడ్డి వంగ తన రూటే మార్చేశాడా?

Animal Pre Teaser: బాలీవుడ్ ని యానిమల్ మూవీ గ్లింప్స్ ఊపేసింది.

Arun Chilukuri
Updated on: 12 Jun 2023 9:30 PM IST
Animal Pre Teaser Review
X

Animal Pre Teaser: బాలీవుడ్ లో ట్రెండ్ బెండ్ తీసేందుకు.. సందీప్ రెడ్డి వంగ తన రూటే మార్చేశాడా?

Animal Pre Teaser: బాలీవుడ్ ని యానిమల్ మూవీ గ్లింప్స్ ఊపేసింది. సౌత్ కూడా ఉలిక్కి పడేలా సందీప్ రెడ్డి వంగ విసిరిన ఈ గ్లింప్స్ వయోలెన్స్ కి పీక్స్అంటున్నారు. కబీర్ సింగ్ ని కూడా మించేలా ఉందంటున్నారు. కబీర్ సింగ్ బాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ అయినా, అది ఓ తెలుగు మూవీ రీమేక్. కాకపోతే ఒరిజినల్ మూవీ అర్జున్ రెడ్డిని తీసింది, కబీర్ సింగ్ గా రీమేక్ చేసింది సందీప్ రెడ్డి వంగానే... ఐనా స్ట్రేయిట్ మూవీతో సందీప్ బాలీవుడ్ ని కుదిపేయలేదనే కామెంట్లు వినిపించాయి. దానికే యానిమల్ తో సమాధానం దొరికినట్టైంది.

టాలీవుడ్ లో శివ తర్వాత ఆరేంజ్ లోట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న మూవీ అర్జున్ రెడ్డి. ఈ సినిమా తో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. ఇక సౌత్ మొత్తం ఈ సినిమా ఓ రేంజ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అ రేంజ్ వైబ్స్ రీ క్రియేట్ కాబోతున్నాయి.

అర్జున్ రెడ్డి మూవీ వచ్చినప్పుడు సందీప్ రెడ్డిని మరో రామ్ గోపాల్ వర్మా అన్నారు. అంతకుమించి అనేశారు. అంతగా ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి మళ్లీ ఇదే మూవీని హిందీలో తీస్తే అక్కడ హిట్ వచ్చింది కాని, ట్రెండ్ సెట్టర్ అనేంత క్రేజ్ క్రియేట్ కాలేదు. కాని ఇప్పుడు ఆ వెలితిని యానిమల్ మూవీ తీర్చేలా ఉంది. సందీప్ రెడ్డి వంగా హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ తో ఎంట్రీ ఇచ్చాడు సక్సెస్ అయ్యాడు. కాని యానిమలే తన ఫస్ట్ స్ట్రేయిట్ ప్రాజెక్ట్. అందుకు తగ్గట్టే గ్లింప్స్ పేలింది. వయోలిన్స్ కి డెఫినేషన్ మార్చేలా గ్లింప్స్ దూసుకెళుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story