Animal Movie: రికార్డులు తిరగరాస్తున్న యానిమల్ మూవీ.. రూ.527.60 కోట్లు వసూలు

Animal Movie Breaking All Records By Playing Full-Day Shows
x

Animal Movie: రికార్డులు తిరగరాస్తున్న యానిమల్ మూవీ.. రూ.527.60 కోట్లు వసూలు

Highlights

Animal Movie: ఇప్పటి వరకు ఇండియాలో రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్

Animal Movie: బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రష్మిక మందన్న నటించిన యానిమ‌ల్ రికార్డులు తిరగరాస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి మ‌రో స‌రికొత్త రికార్డు వ‌చ్చి చేరింది. ఈ సినిమాకు రోజురోజుకు డిమాండ్ పెర‌గ‌డంతో ముంబయిలో థియేట‌ర్ల యాజ‌మాన్యాలు ప్రత్యేక షోలు వేస్తూ స‌రికొత్త సాంప్రదాయానికి తెర తీశారు. బాలీవుడ్‌ చ‌రిత్రలో ఇప్పటివ‌ర‌కు ఏ సినిమాకు జ‌ర‌గ‌ని విధంగా మొట్టమొద‌టి సారిగా యానిమ‌ల్ సినిమాను 24 గంట‌లు నాన్‌స్టాప్‌గా ప్రద‌ర్శిస్తున్నారు.

3 గంట‌ల 21 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం మొద‌టి షోను ఉద‌యం 5గంటలా 30 గంట‌ల‌కు స్టార్ట్ చేస్తే చివ‌రి షో తిరిగి మ‌రుస‌టి రోజు ఉద‌యం 2 గంట‌ల‌కు వేస్తున్నారు. యానిమ‌ల్ చిత్రం గురువారం నాటికి మ‌న దేశంలో అన్ని భాషల్లో కలిపి 300 కోట్లకు పైగానే వసూలు చేయ‌గా, ప్రపంచ వ్యాప్తంగా 527.60 కోట్లు వసూలు సాధించి రికార్డులు తిర‌గరాసింది. ఇక తెలుగు రాష్ట్రాల‌లోనూ 5 రోజుల‌లో 30 కోట్లకు పైగా షేర్ క‌లెక్ట్ చేసి ఇంత‌వ‌ర‌కు ఏ బాలీవుడ్ చిత్రం సాధించ లేని ఘ‌న‌తను సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories