అందుకే తమన్నాతో గొడవ అయింది.. గొడవపై అనిల్ రావిపూడి క్లారిటీ..

Anil Ravipudi Responds to Clashes With Tamanna
x

అందుకే తమన్నాతో గొడవ అయింది.. తమన్నాతో గొడవపై అనిల్ రావిపూడి క్లారిటీ

Highlights

అందుకే తమన్నాతో గొడవ అయింది.. తమన్నాతో గొడవపై అనిల్ రావిపూడి క్లారిటీ

Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహ్రీన్ పిర్జాదా హీరో హీరోయిన్లుగా నటించిన "ఎఫ్2: ఫన్ అండ్ ఫస్ట్రేషన్" సినిమాకి సీక్వెల్ గా ఈ మధ్యనే "ఎఫ్ 3" సినిమా థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ ని అందుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వెంకీ మరియు వరుణ్ లు బాగానే మాట్లాడుతున్నారు కానీ తమన్నా మాత్రం ఎక్కడా కనపడలేదు. అయితే ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి మరియు తమన్నా మధ్య గొడవైందని అందుకే తను ప్రమోషన్స్ కి రావడం లేదు అంటూ ప్రచారం మొదలైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిల్ రావిపూడి ఈ పుకార్లపై రియాక్ట్ అయ్యారు.

"ఒకరోజు తమన్నా చాలా మంది ఆర్టిస్టులతో ఒక సన్నివేశం షూట్ చేయాల్సి వచ్చింది. కానీ అప్పుడు తన సమయం దాటిపోయింది అని, నెక్స్ట్ డే జిమ్ కి వెళ్ళాలని అందుకే వెళ్ళిపోతానని చెప్పింది. దీంతో మా మధ్య చిన్న డిస్టర్బన్స్ వచ్చింది. దాని వల్ల రెండు మూడు రోజులు మా మధ్య పెద్దగా మాటలు లేవు. కానీ నా సినిమా కాబట్టి నేనే మళ్లీ వెళ్లి మాట్లాడేశాను. ఇప్పుడు మేము బాగానే ఉన్నాము. తను వేరే సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల ప్రమోషన్స్ కి రాలేకపోయింది కానీ మరేమీ లేదు" అని క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి. అయితే "ఎఫ్ 4" సినిమా రెండేళ్ల తర్వాత ఉంటుందని, హీరోయిన్లు మాత్రం మారతారని అన్నారు అనిల్ రావిపూడి.

Show Full Article
Print Article
Next Story
More Stories