"ఎఫ్ 3" కి మరొక సీక్వెల్ ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి...

Anil Ravipudi Planning another Sequel for F3 Movie | Tollywood Gossips
x

"ఎఫ్ 3" కి మరొక సీక్వెల్ ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి...

Highlights

Anil Ravipudi: తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కి అనిల్ రావిపూడి మరొక సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది...

Anil Ravipudi: విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మల్టీ స్టారర్ సినిమా "ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్". తమన్నా మరియు మేహరీన్ పిర్జదా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో 2019లో కామెడీ ఎంటర్ టైనర్ గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు.

"ఎఫ్ 3" అనే టైటిల్ తో ఈ సినిమా మే 27న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తమన్నా మరియు మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదటి భాగంలో ముఖ్య పాత్రలు పోషించిన చాలామంది నటీనటులు ఈ సినిమాలో కూడా కనిపించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కి అనిల్ రావిపూడి మరొక సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

"ఎఫ్ 4" అనే టైటిల్ తో ఆ సినిమా విడుదల అవుతుందని కొందరు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. "ఎఫ్ 2" సినిమా బ్లాక్బస్టర్ అయింది కాబట్టి ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే "ఎఫ్ 4" సినిమా చూడటానికి అభిమానులు కూడా ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories