Balakrishna: యాక్షన్ ఎంటర్టైనర్ గా బాలయ్య- అనిల్ మూవీ

Balakrishna: నందమూరి బాలకృష్ణ మాస్, యాక్షన్ సినిమాలకు తిరుగులేని పేరు.

Venkata Chari
Published on: 21 May 2021 4:56 PM IST
Anil Ravipudi Pens An Interesting Character for Nandamuri Balakrishna | Tollywood Latest Updates
X

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి (ఫొటో ట్విట్టర్)

Balakrishna: నందమూరి బాలకృష్ణ మాస్, యాక్షన్ సినిమాలకు తిరుగులేని పేరు. కామెడీ ప్రధానంగా ప్రయత్నించినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు బాలయ్య బాబు.

కామెడీతో కమర్షియల్ మూవీని తీసి హిట్ చేయడంలో నేర్పరి దర్శకుడు అనిల్ రావిపూడి. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ బాలకృష్ణ తదుపరి సినిమా కోసం రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలు వెలువడినప్పటి నుంచి వీరి కాంబోలో మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారంట.

తాజా నివేదికల ప్రకారం, ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 'బాలయ్య క్యారెక్టరైజేషన్ నా మార్క్ తో ఉంటుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్‌లో రానుంది. బాలయ్య ఇమేజ్ ని ఉపయోగించుకుని నా స్టైల్ ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తామని" అన్నాడు.

మరోవైపు, అనిల్ రావిపూడి త్వరలో వెంకటేష్, వరుణ్ తేజ్.. ప్రధాన పాత్రల్లో ఎఫ్ 3 షూటింగ్ లో బిజీ అవుతారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక బాలకృష్ణ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story