మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి

* మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి

Rama Rao
Updated on: 2 May 2022 12:08 PM IST
Anil Ravipudi is Preparing the Script for Mahesh Babu Film
X

మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి

Anil Ravipudi: కమర్షియల్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేస్తూ వరుసగా తన సినిమాలతో సూపర్ హిట్లు అందుకుంటూ కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఈ మధ్యనే విడుదలైన "సరిలేరు నీకెవ్వరు" సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే.

చాలా కాలం తర్వాత మహేష్ బాబు నీకు మళ్ళీ ఒక ఎంటర్టైనింగ్ పాత్రలో చూసి అభిమానులు తెగ సంతోష పడ్డారు. మళ్లీ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎప్పుడు సినిమా చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం "ఎఫ్ 3" సినిమాతో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి త్వరలోనే బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు.

అయితే మహేష్ బాబు తో తన సినిమా ఎప్పుడు ఉంటుంది అని అడగగా ప్రస్తుతం తాను ఆ సినిమా స్క్రిప్ట్ మీదే చేస్తున్నట్లుగా తెలిపారు అనిల్ రావిపూడి. "మహేష్ సార్ ఎప్పుడు రెడీ అంటే నేను సినిమా అప్పుడు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం నేను స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాను. తనకు ఉన్న కమిట్మెంట్ లను పూర్తి చేసుకొని మహేష్ గారు 'అనిల్ సినిమా స్టార్ట్ చేద్దాం' అని అంటే నేను రెడీగా ఉంటాను" అని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.

Rama Rao

Rama Rao

Next Story