Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్ట్ ప్రాజెక్టులో హీరో ఎవరంటే..?

Anil Ravipudi: పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. సరిలేరు నీకెవ్వరు తో సూపర్ హిట్ కొట్టాడు.

Venkata Chari
Published on: 11 March 2021 4:17 PM IST
Anil Ravipudi ‍Finalized his Next Project Hero
X

డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటో హన్స్ ఇండియా)

Anil Ravipudi: పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. మహేశ్ బాబు హీరోగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ప్రిన్స్ నుంచి మరో సినిమా ఆఫర్ సాధించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

ప్రస్తుతం 'సర్కారు వారి పాట' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు సూపర్‌స్టార్. తన తదుపరి సినిమా కోసం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో ప్లాన్ చేశాడు. కానీ, ఈ ప్రాజెక్ట్ ప్రారంభించేలోపు, అనిల్ రావిపూడితో సినిమా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.

అలాగే, నందమూరి బాలకృష్ణ తోనూ అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు అనిల్ ఇప్పుడు 'గాలి సంపత్' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే, అనిల్ రావిపూడి బాలకృష్ణ, మహేష్ బాబు ఇద్దరితో చర్చలు జరుపుతున్నారు. ఎవరి సినిమా ముందు ప్రారంభమవుతుందో చూడాలి.

Venkata Chari

Venkata Chari

Next Story